
తమిళ రాజకీయాల్లోకి రోజా…
సిరా న్యూస్,తిరుపతి; ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా… తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో కీలకంగా పని చేసిన రోజా… చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఇక తన వాగ్ధాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌గా మారిన రోజా… స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా… మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న…
