
రోజా రీ ఎంట్రీ…
సిరా న్యూస్,తిరుపతి; మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. ఆమె ఎక్కువగా చెన్నైలోనో, లేక కుటుంబ సభ్యులతో కలసి విదేశాల్లోనూ పర్యటిస్తూ కాలం గడిపేవారు. పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాదాపు వంద రోజుల నుంచి ఆమె విజయవాడ వైపు కూడా రాలేదు. పార్టీ అధినేత జగన్ ను వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆర్కే రోజాపై అనేక రకమైన ప్రచారం జరిగింది. ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళుతున్నారని, హీరో విజయ్ పెడుతున్న పార్టీలో చేరి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అందుకు తగిన విధంగానే ఆర్కే రోజా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండటంతో నిజమేనని నమ్మిన వాళ్లుచాలా మంది…
