
ద్రవిడ పార్టీల బాటలో గులాబీ పార్టీ
సిరా న్యూస్,హైదరాబాద్; కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. చూడడానికి బక్క పల్చని మనిషి. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి.. శాంతియుద నిరసనలు, సంప్రదింపులు, లాబీయింగ్ ద్వారా స్వరాష్ట్రం సాధించి బక్కోన్ని కాదు బలవంతుడిని అని నిరూపించారు. ఇక స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనే అయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు పార్టీని గెలిపించి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించారు. కొత్త రాష్ట్రమే అయినా తెలంగాణను అన్ని రంగాల్లో పెద్ద రాస్ట్రాలకు దీటుగా అభివద్ధి చేశారు. తాగు, సాగునీటి సమస్య పరిష్కరించారు. కొరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఇందతా ఒక్క రాత్రే జరగలేదు. దీని వెనుక కేసీఆర్ కషి, పట్టుదల, వ్యూహరచన, ప్రణాళిక ఉన్నాయి. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంత సులువుగా అర్థం కావు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన, రెండుసార్లు అధికారంలోకి రావడం…
