
పందులను వదలని గులాబీ నేతలు
మహబూబ్ నగర్; మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాం. ప్రజలు అనవసరంగా భారత రాష్ట్ర సమితిని ఓడించారు. కెసిఆర్ ను ఓడించి పెద్ద తప్పు చేశారు. కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో అవి అమలు చేయకపోతే ప్రజలు ఆ పార్టీని బొంద పెడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరి కాకుండా.. భిన్నమైన ఫలితాలు రావాలి. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాణిని వినిపించాలి అంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్లమెంటుకు పంపించాలి. ఇదీ నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. సరే రాజకీయ నాయకుడు అన్నాక అలాంటి మాటలు మాట్లాడాల్సిందే. పైగా తన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి.. ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి.. పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అంటే అలాంటి మాటలు…
