Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 29 October 2024, 4:44 pmEditor : SIRA NEWS

Sadasaya Foundation Lingamoorthy: నేత్రదాం మహా గొప్ప దానం:  సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి

సిరాన్యూస్‌, ఓదెల
నేత్రదాం మహా గొప్ప దానం:  సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి
నేత్రదాత మెరుగు శంకర్ కు సంస్మరణ సభ
* నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రం అంద‌జేత‌

అన్నిదానాలోకెళ్ల నేత్రదానం మహా గొప్ప దానమని సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అన్నారు . ఓదెల(రామకృష్ణాపూర్) చెందిన మెరుగు శంకర్ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ఇటీవల మృతిచెందారు. ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు భార్య అరుణ, కొడుకు, కోడలు ప్రసాద్, సౌజన్య, ప్రవీణ్ , రాజేశ్వరి కూతురు, అల్లుడు ప్రవళిక మహేందర్ మనమలు మనమరాలు దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదాశివ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మెరుగు భీష్మాచారి నేత ఆధ్వర్యంలో సంస్మరణ సభ ను నిర్వహించారు. నేత్రదాత కు ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. నేత్ర, అవయవ, దేహదానంపై వారు అవగాహన కల్పించారు. అపోహాలు వీడి, నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సారంగం, రాoనారాయణ, మల్లేశం పాపయ్య, నేత్రదాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీరిని ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సాన రామకృష్ణారెడ్డి, నూక రమేష్ , ధ్విరాజ్ వినోద్అభినందించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.