
పాపం… ఏడుగురు టీచర్లు..
సిరా న్యూస్,ఖమ్మం; కొత్తగా ఉద్యోగం సాధించామన్న సంతోషం రోజుల వ్యవధిలోనే ఆవిరైపోయింది. బంధువులు, సన్నిహితులతో పంచుకున్న ఆ ఆనందం పట్టుమని నెల రోజులైనా లేకుండా పోయింది. మరో వారం రోజుల్లో జీవితంలో మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నామనే సంతోషంలో ఉండగానే వారి ఆశలు అడియాశలయ్యాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న 24 రోజుల్లోనే అసలు ఆ ఉద్యోగాలకు మీరు అర్హులే కాదంటూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వారి ఉద్యోగాలను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జిల్లా విద్యాశాఖ తీరు ఏడుగురు ఉపాధ్యాయుల జీవితాలను రోడ్డుపాలు చేసింది.ఆ ఏడుగురు ఉపాధ్యాయులు గత 24 రోజులుగా వారికి కేటాయించిన పాఠశాలల్లో ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్నారు. ప్రతిరోజులాగానే పాఠశాలకు వెళ్లగా వారి స్థానంలో వేరొక…
