
తెలంగాణలో సై అంటే సై
హోరాహోరికి రెండు పార్టీలు సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి మూణ్నాళ్లు కాలేదు అప్పుడే లడాయి షురూ అయింది. ముందటి ప్రభుత్వపు ట్రేడ్ మార్కు పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి ఎకరాలమాగాణం ఘనకీర్తి, కేసీఆర్ భుజకీర్తి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. కృష్ణాబోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే... పాత ప్రాజెక్టులో బొక్కలు బయటకు తీసి..లెక్కలు తేలుస్తానంటూ రేవంత్ రెడ్డి బయలుదేరారు. బయలుదేరడమంటే అట్లా ఇట్లా కాదు మందీమార్బలంతోటి నేరుగా ప్రాజెక్టు మీదనే ప్రెస్‌మీట్ పెట్టారు. మేడిగడ్డలో మీరు చేసేదేం లేదు మీ సంగతి తేలుస్తా అంటూకేసీఆర్ సవాలు చేశారు. మొత్తం మీద రెండు పార్టీల హోరాహోరీకి రెడీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయం రంజుగా మారిపోయింది. నువ్వు…
