Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 June 2024, 1:10 pmEditor : SIRA NEWS

Saidapur:సైదాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సైదాపూర్ మండల కేంద్రంలో బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  అనంత‌రం కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.