జిల్లా వార్తలు

Sajeev Reddy in Rathothsavam: రథోత్సవ వేడుకల్లో సంజీవ్‌ రెడ్డి..

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: అదిలాబాద్‌ కాంగ్రేస్‌ రెబల్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అల్లూరి సంజీవ్‌ రెడ్డి రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం జైనథ్‌ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ కార్యక్రమానికి ఆయన కార్యకర్తలు, నాయకులతో కలిసి హాజరయ్యారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన రథోత్సవంలో పాల్గొని, రథానికి ప్రత్యేక పూజలు చేసారు. ఆయన వెంట ఆయన నాయకులు అభిషేక్‌ రెడ్డి, పిడుగు స్వామి, ఇతర నాయకులు ఉన్నారు.

Read More
1 Dec 2023, 8:24 pm
Updated: 1 Dec 2023, 8:24 pm
siranews.in