తాజా వార్తలు

స్కూల్ కు రాకుండానే ఐదు నెలల నుంచి జీతం

సిరా న్యూస్,మెదక్; మెదక్ జిల్లాలో పాఠశాలకు రాకుండా, పిల్లలకు పాఠాలు చెప్పకుండానే జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయుడి భాగోతం వెలుగు చూసింది. ఐదు నెలలుగా పాఠశాలకు రాకుండా మేనేజ్ చేస్తుంటే, విద్యా శాఖ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది.జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని పలాట గ్రామంలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో తెలుగు బాషా పండితునిగా పనిచేస్తున్న వెంకట కృష్ణ రెడ్డి, గత ఆగష్టు 7న చిన్న శంకరంపేట్ మండలంలోని గజగట్ల పల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు డెప్యూటేషన్‌పై వచ్చాడు.వందమంది విద్యార్థులున్న పాఠశాలలో, అప్పటికే మొత్తం నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు ప్రణిద్‌తో పాటు లతా, కవితలు పనిచేస్తుండగా డెప్యూటేషన్ పైన వచ్చిన మరొక ఉపాద్యాయుడు రాజేశ్వర్ రెడ్డి కూడా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు సరిపోను ఉపాధ్యాయులు ఉన్నా.. మరొక ఉపాద్యాయుడు ఇక్కడికి డెప్యూటేషన్‌పై రావటం గమనార్హం.నిబంధనల…

Read More
20 Dec 2023, 3:53 pm
Updated: 20 Dec 2023, 4:37 pm
siranews.in