
2 వేల నోట్లకు మోక్షం
సిరా న్యూస్,తిరుమల; తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల నోట్లకు మోక్షం లభించింది. రూ.2 వేల నోట్ల మార్పిడిలో ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవసప్థానం ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది.2023 అక్టోబర్ 7 నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఆ తరువాత కూడా భక్తులు తిరుమల శ్రీవారి హుండీలో రూ. 2 వేల నోట్లను కానుకగా సమర్పించారు. ఆ నోట్లు తీసుకునేందుకు బ్యాంకులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది. ఈ…
