Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 3 October 2024, 7:11 pmEditor : SIRA NEWS
Sanyojak Kashaveni Pranai: ఈనెల 19న ఖానాపూర్‌లో వీహెచ్‌పీ సత్యపాన యోజన సమావేశం: నిర్మల్ జిల్లా సంయోజక్ కాశవేణి ప్రణయ్

సిరాన్యూస్, ఖానాపూర్
ఈనెల 19న ఖానాపూర్‌లో వీహెచ్‌పీ సత్యపాన యోజన సమావేశం: నిర్మల్ జిల్లా సంయోజక్ కాశవేణి ప్రణయ్
ఈనెల 19వ తేదీన ఖానాపూర్ లో విశ్వహిందూ పరిషత్ సత్యపాన యోజన సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా సంయోజక్ కాశవేణి ప్రణయ్ తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో సత్యపాన యోజన సమావేశం నిర్వహణపై బైటెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న ఈ సమావేశానికి 20 గ్రామాల నుండి 93 మంది కార్యకర్తలు హాజరౌతారన్నారు. సమావేశంలో వీహెచ్పి నాయకులు గణపురం రాజేశ్వర్, జెట్టి వెంకటేష్, సిద్దు, సాయి, ఆసమ్ ఉదయ్, అల్లాడి వెంకటేష్, సింగ్ ప్రవీణ్, వంశీ, సుబ్బు, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
