
Sarabudla Rajireddy: వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి
సిరా న్యూస్, సైదాపూర్ వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి * కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి * ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని సైదాపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్ళి ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లను ఇచ్చి వారి దాహార్తి తీర్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఈ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల లోపే ప్రజలందరికీ 6 గ్యారంటీల స్కీములను…
