Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 17 December 2023, 5:04 pmEditor : SIRA NEWS
Sarpanch Meets MLA: ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్ గిత్తె కల్పన గజానంద్..

సిరా న్యూస్, బోథ్:
ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్ గిత్తె కల్పన గజానంద్..
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కొల్హరి గ్రామ సర్పంచ్ గిత్తె కల్పన గజానంద్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సర్పంచ్ దంపతులు, ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు. మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఆయనకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కొల్హారి గ్రామ అభివృద్ధికి తప్పక కృషీ చేస్తానని హామీ ఇచ్చారు.
