Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 27 September 2024, 7:59 pmEditor : SIRA NEWS

Sayavva: వయోభారం.. జీవితంపై విరక్తితో సాయవ్వ ఆత్మహత్యాయత్నం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
వయోభారం.. జీవితంపై విరక్తితో సాయవ్వ ఆత్మహత్యాయత్నం

వయోభారం.. ఆపై జీవితంపై విరక్తితో ఓ వృద్ధులు గోదావ‌రి న‌దిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని శాంతినగర్ కాలనీకి చెందిన బోదాసు సాయవ్వ (70)అనే వృద్ధురాలు తనకి వృద్ధాప్యం పైన పడడంతో తన కొడుకులు ,కూతురు గాని ఎవ్వరూ చూడకపోవడంతో ఆమె చనిపోవాలనుకుని శ్రీరామ్ నగర్ శివారు గల గోదావరిలో దూకింది. నీటిలో కొట్టుకు వెళ్తుండుగా అక్కడే చేపలు పడుతున్న జాలరులు ఆమెను చూసి రక్షించి బయటికి తీశారు. వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయగా బ్లూ కోర్ట్ సిబ్బంది వెంటనే వెళ్లి ఆమెను సురక్షితంగా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.. పోలీస్ స్టేషన్లో ఖానాపూర్ సిఐ ఆమె బంధువులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.అనంత‌రం ఆమెను బంధువులకి సురక్షితంగా అప్పగించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.