తాజా వార్తలు

బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషణ

సిరా న్యూస్,హైదరాబాద్; లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌లో కింది స్థాయి నేతల నుంచి ఎంపీ టిక్కెట్ పొందగలిగే స్థాయి నేతల వరకూ రాత్రికి రాత్రే జంప్ చేస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో చాలామంది. కానీ బీఆర్ఎస్ మాత్రం.. ఒక వేళ టిక్కెట్ ఇస్తే ఉంటారా .. వెళ్లిపోతారా అన్న సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిమామాలు బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. నిన్నటి దాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూడటంతో కేసీఆర్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో హైదరబాద్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని…

Read More
6 Mar 2024, 12:24 pmsiranews.in