
రైతులు రుణమాఫీ కోసం సెల్ఫీల నిరసన
సిరా న్యూస్,మెదక్; రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సగం మంది రైతులకు కూడా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే వైవిధ్యంగా పలుమార్లు ఆందోళనలు చేపట్టిన రైతులు తాజాగా ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ’ పేరుతో వినూత్న ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపేందుకు వీలుగా సెల్పీ వీడియోలు తీసుకుని పంపుతున్నారు. రైతులంతా ఒక్కచోట చేరి ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ’ వీడియోలు తీసి ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సీఎంవోకు పంపే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలంలో పాసుబుక్కులతో సెల్పీలు ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోనీ ముఖరా (కే) గ్రామంలోనీ…
