
1715 నుంచి తిరుమల లడ్డూ విక్రయం
సిరా న్యూస్,తిరుమల; కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకు వెళ్ళేది లడ్డూలు. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామి వారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా 309 ఏళ్లు పూర్తి అయ్యింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు.తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి వారి దర్శన అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి…
