
పార్లమెంట్ సీట్లపై సీనియర్లు గురి
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా చూస్తామన్నారు కానీ ఇంత వరకూ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించలేకపోయారు. దీనికి కారణం పోటీ తీవ్రంగా ఉండటమే. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఆయన ఇటీవలే రాజ్యసభ…
