తాజా వార్తలు

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిరా న్యూస్,జనగామ; పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు స్థానికుల సహాయంతో ఆవులను బయటకు తీసారు. సుమారు 100కు పైగా ఆవులు ఉన్నట్లు గుర్తించారు. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.

Read More
28 Sep 2024, 1:45 pm
Updated: 28 Sep 2024, 1:47 pm
siranews.in