Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 15 February 2024, 5:46 pmEditor : SIRA NEWS

Sewalal Maharaj: సేవాలాల్ మహారాజ్ అడుగు జాడ‌ల్లో న‌డ‌వాలి

సిరా న్యూస్ ,బేల‌
సేవాలాల్ మహారాజ్ అడుగు జాడ‌ల్లో న‌డ‌వాలి
* బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్
*  ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
ప్ర‌తి ఒక్క‌రూ సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగు జాడ‌ల్లో న‌డ‌వాలని బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్ అన్నారు.  గురువారం బేల మండల కేంద్రంలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్బంగా బంజారా కులస్థులు అందరు కలిసి కట్టుగా సాంప్రదాయ వేశాధారణలో నృత్యాలు చేస్తూ భారీ శోభ యాత్ర నిర్వహించారు.  మండల కేంద్రంలో గల సంత్ సేవాలాల్ విగ్రహనికి పూలమాలలు వేసి పూజలు చేసి సేవాలాల్ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజార బిడ్డలకి ఒక ఆదర్శపూరుషుడు అని జాతి మొత్తానికి ఏకం చేసిన మహా యోధుడు అని పేర్కొన్నారు.  ఒకరినొక్కరు పరిచయం లేకున్నా అందర్నీ ఒక తాటిపై తీసుకొచ్చి యావత్ ప్రజానికి నాయకత్వ లక్షణాలు ప్రసాదించిన మహా కర్మయోగి అని అన్నారు.  వారి అడుగు జాడల్లో నేటి తరం నాడవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ బంజారా సర్పంచ్,  ఎంపీటీసీ లు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.