
అనిల్ కు షిఫ్ట్….తప్పదా
సిరా న్యూస్, నెల్లూరు; ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడా పెడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎవరైనా సరే.. ఎంతటి వాయిస్ ఉన్నోళ్లయినా సరే.. ఎంతటి తోపుగాళ్లయినా సరే.. గెలవడం తనకు ముఖ్యమని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జులను నియమించారు. భవిష్యత్ లోనూ అనేక మందిని ట్రాన్స్‌ఫర్ చేయడానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎద్దేవా చేసినా.. చేతకానితనం అనుకున్నా.... ఓటమి భయమని భావించినా.. సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ను కూడా అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం…
