
Shobha Yatra – శోభయమానంగా శోభయాత్ర
సిరా న్యూస్, లోకేశ్వరం: శోభయమానంగా శోభయాత్ర – అయోధ్య నుంచి లోకేశ్వరం మండల కేంద్రానికి చేరుకున్న అక్షంతలు – కాషాయ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు శ్రీరామ జన్మభూమి అయోధ్య నుంచి లోకేశ్వరం మండల కేంద్రానికి అక్షంతలు చేరుకోవడంతో గ్రామస్తులు, హిందూ వాహిని కార్యకర్తలు సోమవారం శోభయాత్ర నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. కాషాయపు జెండాలను చేతబూని శ్రీరామ నినాదం చేయటంతో వీధులు కాషాయమయంగా మారాయి. ఈ శోభయాత్ర పలు వీధుల గుండా శోభయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, హిందు వాహిని కార్యకర్తలు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
