
టీడీపీలోకి మాగుంట…
సిరా న్యూస్,ఒంగోలు; ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దూకుడు పెంచారు. వైసీపీని వీడేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. టిడిపిలో చేరేందుకు కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఎంపీ అభ్యర్థిగా గ్రీన్ సిగ్నల్ లభించింది. తన కుమారుడు ఎమ్మెల్యే టికెట్ విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. చంద్రబాబు నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఆయన.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ విషయంపై జగన్ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ప్రత్యామ్నాయం వైపు మాగుంట అడుగులు వేస్తున్నారు. టిడిపిలో చేరితేనే బాగుంటుందన్న స్థిర నిర్ణయానికి వచ్చారు. కుమారుడితో పాటు టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వివాదాలు…
