ప్రజా సమస్యలు

Shyam Prasad Lal:భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

సిరాన్యూస్‌, ఓదెల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఓదెల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వివిధ సమస్యలపై దరఖాస్తుల సమర్పించేందుకు వచ్చిన రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి…

Read More
1 Aug 2024, 5:29 pmsiranews.in