
SI BANDI RAJESH: 130 నాటు కోళ్లు మృతి
సిరా న్యూస్, కరీంనగర్ 130 నాటు కోళ్లు మృతి *సంఘటనా పై పోలీసుల ఆరా... *విష ప్రయోగంతో కోళ్లను మృతి చెందినట్లు అనుమానాలు.. 130 నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వీరమల్ల కుమార్ (41) తండ్రి మల్లయ్య అనే రైతు గత 2 సంవత్సరాల నుండి తన మూడు ఎకరాల వ్యవసాయ బావి వద్ద కోళ్ల ఫారం నిర్మించుకొని నాటు కోళ్లు పెంపకం చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి కోళ్ల ఫారం వద్ద నిద్రించేవాడు. మంగళవారం మాత్రం సాయంత్రం కోళ్లకు దాన వేసి ఇంటికి వెళ్ళాడు.బుధవారం ఉదయం తిరిగి కోళ్ల ఫారం వద్దకు వచ్చేసరికి 130 కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. బోరున…
