Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 September 2024, 8:03 pmEditor : SIRA NEWS

SI Purushottam:పాము కాటుకు యువకుడు ఇరవేణి రవీందర్ మృతి : ఎస్సై పురుషోత్తం

సిరా న్యూస్‌, జైన‌థ్‌
పాము కాటుకు యువకుడు ఇరవేణి రవీందర్ మృతి : ఎస్సై పురుషోత్తం

పాటుకాటుతో యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలో బాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎసై పురుషోత్తం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామానికి చెందిన ఇరవేణి రవీందర్ (36) మేస్త్రి ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 4 గంటలకు ఇంట్లో క్రింద నిద్రిస్తున్న రవీందర్ ను పాము కాటు వేసింది. వెంట‌నే గ‌మ‌నించిన కుటుంబీకులు ఇరవేణి రవీందర్ రిమ్స్‌ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. యువకుని తమ్ముడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.