తాజా వార్తలు

తెలంగాణ నుంచి సింఘ్వీ

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది? తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఆ సీటు ఇస్తారా? లేకా సీనియర్లకు ఇస్తారా? ఇదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్న దానిపై నేతలు చర్చించుకోవడం మొదలైంది.తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడవాళ్లకు సీటు ఇవ్వడం ఖాయమన్నది కొందరి నేతల వాదన. కానీ ఈ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి…

Read More
6 Jul 2024, 1:35 pmsiranews.in