
Social Media: మంత్రిపై అనుచిత పోస్టులు పెడితే సహించం
సిరా న్యూస్, చిగురుమామిడి: అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి --గీకురు రవీందర్ జెడ్పి ఫ్లోర్ లీడర్ రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు. ఈ మేరకు జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ తో కలిసి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేశవపట్నం 24/7 న్యూస్ వాట్సాప్ గ్రూపులో పాకాల విజయేందర్ రెడ్డి, ఫేస్ బుక్ లో మావురపు అశోక్ అనే వ్యక్తులు మంత్రిపై అసభ్య పదజాలంతో, అనుచిత పోస్టులు పెట్టారన్నారు. మంత్రి వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా అసభ్య పోస్టులు పెట్టడం వారి…
