తాజా వార్తలు

Dharani problems…ధరణి సమస్యలకు పరిష్కారం…

సిరా న్యూస్,వరంగల్; ధరణి పోర్టల్ లోని సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఓ కమిటీని కూడా నియమించింది. గత కొద్దిరోజులుగా ఈ కమిటీ ధరణి పోర్టల్ పై సమీక్ష చేస్తోంది. క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తూ పలు సమస్యలను తెలుసుకునే పని చేస్తోంది. ఇటీవలే ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.ధ‌ర‌ణి పోర్టల్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. సమస్యల పరిష్కారానికి త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాలను బ‌ద‌లాయింపు చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో వెల్లడించింది. ప్రభుత్వం మార్గదర్శకాల ఫలితంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కలిగే అవకాశం ఉంది.వారం రోజుల పాటు ధరణి సమస్యలు…

Read More
1 Mar 2024, 4:24 pmsiranews.in