
SP Goush Alam: నలుగురు పోలీస్ అధికారులకు సన్మానించిన ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్, ఆదిలాబాద్ నలుగురు పోలీస్ అధికారులకు సన్మానించిన ఎస్పీ గౌష్ ఆలం సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగడానికి అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరి కృషిని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అభినందించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా నుంచి పదవీ విరమణ పొందుతున్న నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువా పూలమాలతో సన్మానించి బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, పోలీసు వ్యవస్థలు సుదీర్ఘ కాలం పాటు సేవలందించి, సంఘవిద్రోహశక్తులతో పోరాడి, ప్రశాంత వాతావరణంలో ప్రస్తుత జిల్లా ఉండడానికి కారణమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రతి పండగలాగే పదవీ విరమణ దినోత్సవం…
