తాజా వార్తలు

సొంత ఇలాఖాకు దూరంగా ఈటెల

సిరా న్యూస్,కరీంనగర్; ఈటల రాజేందర్‌.. తెలంగాణకు పరిచయం అక్కర లేని పేరు. 1964 మార్చి 20న ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది హుజూరాబాద్‌. 2001లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి వ్వవస్థాపకుల్లో ఒకరు ఈటల రాజేందర్‌ 2004 నుంచి, 2021 వరకు హుజూరాబాద్‌ ప్రజలు ఆయనను గెలిపిస్తు వచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అక్కడి ప్రజలు.. 2023 ఎన్నికల్లో ఓడించారు. అప్పటి నుంచి ఆయన హుజూరాబాద్‌తో అంటి ముట్టనట్టు ఉంటున్నారు.హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. వరుస విజయాలతో తనకు ఎదురు లేదని భావించిన తరుణంలో అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీనిని ఈటల అనుచరులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం లేదు. ఓటమి తర్వాత ఈటల హుజూరాబాద్‌వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో ఆయన అనుచరులు…

Read More
14 Mar 2024, 12:44 pmsiranews.in