తాజా వార్తలు

ఆరు రాష్ట్రాలకు స్పెషల్ పోలీసులు.

సిరా న్యూస్,న్యూఢిల్లీ; లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటన పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం శీతకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు ఆరు రాష్ట్రాల కు వెళ్లాయి. నిందితులను కూడా వెంట తీసుకెళ్లాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కేసు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వాపరాలను మరో 50 బృందాలు సేకరిస్తున్నాయి. పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఫోన్లను అతడు దహనం చేసినట్లు గుర్తించారు. కాలిపోయిన ఫోన్లను…

Read More
19 Dec 2023, 2:30 pmsiranews.in