
అంగరంగ వైభవంగా మొదలైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
చేరినాడు చూడరో... లక్ష్మీ నరసింహుడు అత్తారింటి నుంచి కోనకు పెంచలస్వామి గిరిజనవాడలో అంబరాన్నంటిన సంబరాలు నవ వధూవరులకు గిరిజనుల సారె ఉత్సవాల అనంతరం తిరిగి అత్తారింటికి.. సిరా న్యూస్,బద్వేలు; గోనుపల్లి, గోనుపల్లి గిరిజన వాడలు గోవింద, పెంచల నామస్మరణలతో మారుమోగాయి. తప్పెట్లు,తాళాలు, బాజాభజంత్రీల నడుమ ఉభయ దేవేరులతో కలిసి పెంచల నృసింహుడు బ్రహ్మోత్సవాలు చేసుకునేందుకు అత్తారింటి నుంచి కోనకు పయనమయ్యారు.తొలుత గోనుపల్లి గ్రామంలోని పెంచల ఆలయం నుంచి పల్లకిలో చెంచులక్ష్మి అమ్మవారి ఇంటికి (గిరిజనవాడ)కు చేరుకున్నారు. కొత్త అల్లుడి రాకతో గిరిజనవాడలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటికి వచ్చిన అల్లుడికి గిరిజనులు తమ ఆచారం ప్రకారం పుట్టతేనె, ఇంజేటి గడ్డలు, నారె మొలతాడును సారెగా ఇచ్చారు.వాడలోని ప్రతి ఇంటి వద్ద ప్రత్యేక పందిళ్లు, ముగ్గులు వేసి వధూవరులకు ఘన స్వాగతం పలికారు. అత్తారింటికి చేరుకున్న నవవరుడిని (శ్రీవారిని) చూసేందుకు…
