భద్రాద్రిలో శ్రీరామకల్యాణమా? లక్ష్మీనారాయణుల కల్యాణమా?
సిరా న్యూస్,ఖమ్మం; రాముడా? నారాయణుడా? దశాబ్ద కాలంగా రాములోరి క్షేత్రం భద్రాచలంలో ఇదే చర్చ జరుగుతోంది. తెగని వివాదంపై హైకోర్టును ఆశ్రయించారు రామ భక్తులు. కోర్టు వేసిన ఐదుగురి సభ్యుల కమిటీ రెండు రోజుల పాటు అర్చకులు, పండితుల అభిప్రాయాలు సేకరిస్తోంది. తర్వాత కోర్టుకు రిపోర్టు సమర్పించనుంది. ఇంతకీ భద్రాద్రిలో ఈ పంచాయితీ ఎందుకు?దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో దశాబ్దకాలంగా రామనారాయణపై వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తరుణంలో చర్చ తెరమీదకు వస్తుంది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామకల్యాణమా లేక లక్ష్మీనారాయణుల కల్యాణమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తుండటం చర్చకు దారి తీస్తోంది. దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం శ్రీరామనవమి ముందు తెరపైకి రావటం, తర్వాత తెరమరుగు కావటం ఏటా జరుగుతోంది.ఈ క్రమంలో ప్రభుత్వమే ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, అధికారుల దృష్టికి…
