Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 7 March 2024, 6:44 pmEditor : SIRA NEWS

Srinivas Goud: మండల బిజెపి అధ్యక్షుడిగా పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్

సిరా న్యూస్, చిగురుమామిడి
మండల బిజెపి అధ్యక్షుడిగా పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల బిజెపి అధ్యక్షుడిగా కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నియామకపత్రం అందజేశారు. శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మండల ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాడు.పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనందున అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
గతంలో పని చేసిన అధ్యక్షుడు..
డిసెంబర్ లో ఎన్నికల సందర్భంలో రాజీనామా చేయగా మూడు నెలల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించారు.తన నియామకం పట్ల జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.