
ఎడారిగా శ్రీరామ్ సాగర్
సిరా న్యూస్,నిజామాబాద్; ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 12 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే నీరుంది. దీంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి పడిపోయింది. వర్షాకాలం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా.. వరుణుడి కరుణ లేకపోవటంతో ఇప్పటివరకు కేవలం 1 టీఎంసీ నీరుమాత్రమే చేరింది. అటు ప్రాజెక్టు ఎగువన గల గోదావరి పరివాహ ప్రాంతంలో సైతం వర్షాలు లేకపోవడంతో గోదావరిలోకి ఇన్‌ఫ్లో లేకపోవటం, ఇటు ఖరీఫ్ సీజన్ మొదలు కావటంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది.ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్ట్‌ల పరిస్థితీ ఇదే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం…
