సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
శ్రీరాంపూర్ లో అన్నదానం చేపట్టిన శివ గణేష్ యూత్ సభ్యులు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీరాంపూర్ లో శివ గణేష్ యూత్ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ నవరాత్రి సమయంలో ప్రతి సంవత్సరం అన్న ప్రసాదం కార్యక్రమం చేస్తామని యూత్ సభ్యులు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జుకంటి శిరీష, మాజీ సర్పంచ్ మాధసి సతీష్, యూత్ సభ్యులు మెట్టు మధు, కొలగాని కొమురయ్య, ఆశదాపు పోచాలు, ఆశాదాపు రాజయ్య, కోట శ్రీనివాస్, గంగాధరి సతీష్, ఆశాదాపు సురేష్, తదితరులు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.