
నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల
సిరా న్యూస్,శ్రీశైలం; ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా నమోదైంది.తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటలలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.437 మిలియన్ యూనిట్ విద్యుత్తు…
