
ఉందిగా జాగా…వేసేయ్ పాగా…
సిరా న్యూస్,వరంగల్; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓరుగల్లు భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నగరం చుట్టూ పక్కల ఎకరం ధర లక్షల్లో ఉంటే ఇప్పుడు రూ.కోట్లలోకి ఎగబాకింది. నగరం, నగరం చుట్టు పక్కల జరుగుతున్న అభివృద్ధితో పాటు పట్టణ జనాభా సైతం గణనీయంగా పెరగడం భూముల రేట్లు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే భూముల విలువ పెరుగుదలతో పాటు అంతే స్థాయిలో వివాదాలు, కబ్జాలు పెరగడం గమనార్హం. అధికారం అండదండలతో, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలోని లోపభూయిష్టమైన విధానాలను ఆకలింపు చేసుకుంటున్న కబ్జా గ్యాంగులు భూ వివాదాలకు పాల్పడుతూ కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించుకుంటున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఈ తరహా దందాలు, కేసులు ఓరుగల్లులో వేలల్లో ఉండటం గమనార్హం. రెవెన్యూ అధికారులే స్వయంగా నకిలీ పత్రాల తయారీలో కబ్జా గ్యాంగులకు సహకరిస్తుండడం విశేషం. కొంతమంది…
