
అభ్యర్ధుల ఎంపికపై ఆచితూచి అడుగులు
సిరా న్యూస్,గుంటూరు; అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేసారా అంటే అవుననే అనిపిస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం అనేక నిర్ణయాలు తీసుకొంటున్నారు పవన్.. పొత్తును విమర్శించే వారికి పార్టీలో చోటు లేదంటూనే.. వాళ్లు వైసీపీతో టచ్లో ఉన్నట్టు భావిస్తానని పవన్ పేర్కొంటున్నారు. అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా వెనకడుగువేయనని స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఏపీలో పొత్తుల విషయంలో సొంత పార్టీలో నెలకొన్న వివాదాలు, విభేదాలు, విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్న సేనాని ఇటీవల నియోకవర్గ స్థాయి జనసేన పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సైతం చేశారు.భేటీ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ పరిస్థితి, సామాజిక రాజకీయ పరిణామాల దృష్ట్యా…
