
Steps to Rama’s prestige రాముడి ప్రతిష్టకు అడుగులు
84 సెకన్ల శుభఘడియలు సిరా న్యూస్,లక్నో; అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రారంభం కానుంది. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 2024, జనవరి 22న అయోధ్య మందిరం గర్భగుడిలో.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆరోజు 84 సెకన్లపాటు శుభ ఘడియలు ఉన్నాయని పండితులు తెలిపారు. ఆ సమయంలో అయోధ్య మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందని వెల్లడించారు. జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12:29:08 సెకన్ల నుంచి 12:30:32 సెకన్ల మధ్య అత్యంత శుభ ఘడియలు ఉన్నాయి. అయోధ్యకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అద్భుతాలు తరలివెళ్తున్నాయి. విదేశాల నుంచి కూడా కానుకలు రానున్నాయి.తమిళనాడు నమక్కల్ నుంచి…
