
గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు..!
పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి.. సిరా న్యూస్,కరీంనగర్; శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ పరంగా పకడ్బందీ ఏర్పాట్లు. సిసి కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర.ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్త్ ఏర్పాటుm బందోబస్త్ లో పాల్గొనే అధికారులకు పలు సూచనలు చేసారు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని జాన్ విల్సన్ హాలు నందు గణేష్ నిమజ్ఙన బందోబస్తులో పాల్గొనే అధికారులకు సోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, నిమజ్జన కేంద్రాలయిన మానకొండూరు చెరువు , చింతకుంట కెనాల్ , కొత్తపల్లి చెరువులతో పాటు , గణేష్ శోభాయాత్ర జరిగే రూట్ ల యందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు…
