
నత్తనడకన పనులు
సిరా న్యూస్,మెదక్; సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 13 నెలలుగా కేవలం బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే పనుల్లో డిలే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి టౌన్ లోని బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద రెండెకరాల స్థలంలో రూ.6.70 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందరికీ సౌకర్యంగా ఉండాలని ఉద్దేశంతో ఒకే దగ్గర వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు, కూరగాయలు ఇతరత్రా అమ్మకాలకు సంబంధించి 104 షాపులలో కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు గాను 2021 డిసెంబర్ 18న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వెంటనే టెండర్లు పూర్తిచేసి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఏడాదిలోగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ…
