
వసతి గృహాల్లోని విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించాలి
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం ; వసతి గృహాల్లో విద్యనభ్యశిస్తున్న విద్యార్థులను హెచ్.డబ్ల్యు.ఓలు తమ సొంత బిడ్డల్లా భావించి సంక్షేమాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు . బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహామును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుకుంటున్న విద్యార్థినిలతో ఆయన మాట్లాడారు. వసతి గృహాలలో వారికి అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాలలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగిన భయపడకుండా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా వంట తయారు చేసే గదులు, పిల్లలు ఉంటున్న గదులును, బాత్రూమ్ లు హాస్టల్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలకు నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి…
