
Students reduced to Canada : కెనడాకు తగ్గిన విద్యార్ధులు
సిరా న్యూస్,హైదరాబాద్; భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తడంతో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. 2023లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జరీ చేసింది. అంతకు ముందు ఈ సంఖ్య 1,08,940గా ఉంది. అంటే దాదాపు 86 శాతం భారతీయ విద్యార్థులు తగ్గిపోయారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతీయ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపణలు చేయడంలో ఇరుదేశాల మధ్య దౌతపరమైన విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న రాయబారులను తగ్గించుకోవాలి అని భారత్ కెనడాకు సూచించింది. దీంతో కెనడా 41 మంది దైత్యాధికారులను తమ స్వదేశానికి పిలిపించింది. ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను…
