సిరా న్యూస్,కమాన్ పూర్;
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మహనీయుడు అబ్దుల్ సుభాన్ అని కమాన్ పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ అన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల సమయంలో తాడిచెర్ల మండలం కొయ్యూరు మండలంలో 1993 జూన్ 14 ఎడ్లపల్లి వైపు ట్రాక్టర్ పై వెళుతుండగా నక్సల్స్ పేల్చిన బాంబ్ బ్లాస్టింగ్ లో అబ్దుల్ సుభాన్ అసువులు బాసాడు. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా దీంతో కమాన్ పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సోమవారం పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు గల దివంగత ఎస్సై ఎం ఏ సుభాన్ విగ్రహానికి కమాన్ పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ తో పాటు ఏ. ఎస్. ఐ బాలాజీ నాయక్, పోలీస్ సిబ్బంది అలాగే అమరవీరుడు సుభాన్ కుటుంబ సభ్యులు ఇర్ఫాన్, అంజుమ్, అర్షియా, అప్రా లు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.