
సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ సేవలు విస్తృతం
ఖాతాదారులకు అన్ని బ్యాంకుల కన్నా సుధా బ్యాంకు నుండి మెరుగైన సేవలు వాణిజ్య ,వ్యాపార, వ్యవసాయ, ఉపాధి రంగాలకు బ్యాంకు నుండి రుణాలు రిజర్వ్ బ్యాంకు ,రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏకైక బ్యాంకు సుధా బ్యాంకు. చైర్మన్ మీలా మహదేవ్, ఎండి పెద్దిరెడ్డి గణేష్ సిరా న్యూస్,సూర్యాపేట; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లక్ష్యమని బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ బ్యాంకు ఎండి పెద్దిరెడ్డి గణేష్ లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల ఆత్మీయ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు, రాష్ట్రవ్యాప్తంగా శాఖలు కలిగి గత 24 సంవత్సరాలుగా అన్ని బ్యాంకుల కంటే దీటుగా ఖాతాదారులకు సేవలందిస్తున్న బ్యాంకు…
