
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సిరా న్యూస్,హైదరాబాద్; ఉత్తర ఛత్తీస్గఢ్ విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న నిన్నటి ద్రోణి, ఈ రోజు అంతర్గత ఒడిషా నుంచి దక్షిణ ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, కర్నాటక మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ…
