
డైరక్ట్ ఎన్నికల్లో సుజనా, సీఎం రమేష్
సిరా న్యూస్,విజయవాడ; వాళ్లిద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారు. వారి రాజకీయ జీవితంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ ప్రత్యక్ష ఎన్నికలలో పోరాడేందుకు బరిలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. వాళ్లే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్. బీజేపీ నుంచి రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బీజేపీకి కేటాయించిన సీట్లలో వాళ్లిద్దరూ బరిలోకి దిగుతారని పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు నమ్మకమైన నేతలు. బ్యాక్ ఆఫీస్ లో ఉంటూ పార్టీకి అన్ని రకాలుగా సాయం అందించేవారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికవర్గం పరంగా కూడా బలమైన…
